![]() |
![]() |
.webp)
స్టార్ మాలో గోరింటాకు సీరియల్ లో నటించిన నిఖిల్ అంటే చాలు తెలుగు ఆడియన్స్ కి ఎంతో ప్రేమ, అభిమానం..అతన్ని ఒక హీరో మెటీరియల్ లా చూస్తూ ఉంటారు. అలాంటి నిఖిల్ గోరింటాకు తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటించాడు. ఐతే నిఖిల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు..."విలన్ గా మూవీస్ లో ఎంట్రీ ఇవ్వాలనేది నా డ్రీం.. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి వాళ్లంతా విలన్స్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో తెలుసు.
ఎవ్వరైనా నన్ను గుర్తించి విలన్ రోల్ ఇస్తానంటే వెళ్ళిపోతాను. అందులోనూ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మూవీస్ లో విలన్ రోల్ వస్తే ఇంకా బాగుంటుంది..ముందు నేను అల్లు అర్జున్ ని, ప్రభుదేవా, మైకేల్ జాక్సన్ ని చూసి డాన్స్ నేర్చుకున్నా. ఆర్య మూవీలో అల్లు అర్జున్ వేసుకున్న డ్రెస్సుల్లాంటివి అప్పట్లో కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నా. ఐతే అప్పటికి నేను ఇండస్ట్రీలో లేను...కానీ ఇప్పుడు వచ్చాను కదా..అందుకే అల్లు అర్జున్ మూవీలో కచ్చితంగా విలన్ గా చేయాలి. ఇక కావ్యకు నాకు మధ్య బెస్ట్ ఫ్రెండ్ రిలేషన్ మాత్రమే. ఆమె చాలా మెచ్యూర్డ్, బ్యూటిఫుల్ సోల్. ఎలాంటి అమ్మాయి వస్తే లైఫ్ బాగుంటుంది అని అబ్బాయిలంతా కోరుకుంటారో అలాంటి అమ్మాయి కావ్య. పెళ్ళికి చాలా టైం ఉంది. ఇప్పటికీ నేను ఇంకా గాలికే తిరుగుతున్నా, సెటిల్ కాలేదు.. మా ఇంట్లో ఐతే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోమని ఫ్రీడమ్ ఇచ్చేసారు. కావ్య లాంటి అమ్మాయి నా లాంటి వాడికి ఫ్రెండ్ గా దొరకడమే చాలా ఎక్కువా...బయట ఇద్దరం కనిపిస్తే పెళ్ళెప్పుడు అని ఫాన్స్ అడుగుతారు..అది వాళ్ళ అభిమానం. కానీ ఇది ఇండస్ట్రీ..ఏదీ మన చేతుల్లో ఉండదు.." అని చెప్పాడు నిఖిల్.
![]() |
![]() |